ప్రవాసాంధ్ర భరోసా బీమా ద్వారా మెడికల్ ఖర్చులకు గాను వేగి సూర్యనారాయణ కు Rs. 19,038/- అందచేసిన ఏపీఎన్ఆర్టీ

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన వేగి సూర్యనారాయణ ఏపీఎన్ఆర్టీ అందిస్తున్న ప్రవాసాంధ్ర భరోసా బీమా లో ఏపీఎన్ఆర్టీ ఎగ్జిక్యూటివ్ రాయుడు వెంకటేశ్వరరావు ద్వారా ఇన్సూరెన్స్ నమోదు చేసుకుని 3 నెలలు అయింది. బహ్రెయిన్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో స్టీల్ పని లో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు.

కాగా జనవరి 6,2019 న అతను పని చేస్తున్న కంపెనీలో ప్రమాదవశాత్తు బ్లేడ్ విరిగి అతని తొడ భాగంలో గాయం అయినది. వెంటనే బహ్రెయిన్ ఆస్పత్రిలో ప్రధమ చికిత్స చేయించుకోవడం జరిగింది. అక్కడి వైద్యుల సలహా మేరకు ఇండియా తిరిగి వచ్చి అతని స్వగ్రామం రాజోలులో సూర్య మల్టీస్పెషలిటీ హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నారు. దానికి గాను 19,038/- ఖర్చు అయినది.

అతను ప్రవాసాంధ్ర భరోసా బీమా లో సభ్యుడుగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఏపీఎన్ఆర్టీ కి తెలిపి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను ఫిబ్రవరి 25 న చేసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఒక రోజులో పూర్తి చేసి అతని ఖాతాలో ఫిబ్రవరి 26 న ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ జమ చేయడం జరిగింది.

గమనిక:

ఎవరైనా ప్రవాసాంధ్ర భరోసా బీమా తీసుకోని వారు ఉంటే తప్పక మే నెలాఖరు లోగ ఏ విధమయిన ప్రాసెసింగ్ ఫీ లేకుండా ఈ బీమా సౌకర్యాన్ని పొందవచ్చు. ఆన్ లైన్ లో నమోదు కొరకు https://www.apnrt.com/home/insurance

మరిన్ని వివరాలను ఇక్కడ కామెంట్ రూపంలో కాని, మా హెల్ప్ లైన్ నెంబర్ +918632340678 ద్వారా కానీ,మీ దేశాల్లో ఉన్న ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ ని సంప్రదించండి. ఈ సమాచారం విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ స్నేహితులకు షేర్ చేసి వారికి కూడా తెలిసే విధంగా చేయండి.