ఉపాధికోసం కువైట్ వెళ్లి, జీతం రాక ఇబ్బందులు పడుతున్న వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ APNRTS సహకారంతో స్వస్థలాలకు చేరుకున్నారు

ఉపాధికోసం కువైట్ వెళ్లి, జీతం రాక ఇబ్బందులు పడుతున్న వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ APNRTS సహకారంతో స్వస్థలాలకు చేరుకున్నారు. సంవత్సరం క్రితం కువైట్ లోని ఓ ప్రాంతంలో వ్యవసాయ కేంద్రంలో పనిచేయడానికి సుమారు 11 మంది వై.యస్.ఆర్. జిల్లా వాసులు కువైట్ వెళ్ళారు. అయితే వారందరికీ స్పాన్సర్ జీతం ఇవ్వలేదు.. ఈ విషయాన్ని బాధితుల బంధువులు APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్ మేడపాటి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి కువైట్లోని భారత రాయబారికి పూర్తి వివరాలతో ఇమెయిల్ పంపారు. APNRTS కో ఆర్డినేటర్లు 11 మందిని ఇండియన్ ఎంబసీ దగ్గరకు తీసుకెళ్ళి, ఎంబసీ అధికారులతో మాట్లాడి 11 మందిలో 7 మందిని ఇండియన్ ఎంబసీ సహాయంతో భారతదేశం పంపడం జరిగింది. మిగతా నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో వారికి APNRTS సభ్యులు హోమ్ క్వారంటైన్ ఏర్పాటు చేశారు మరియు వారు స్పాన్సర్ దగ్గర నుండి బయటికి వచ్చినప్పుడు భోజన వసతి కూడా కల్పించడము జరిగింది.