ఏపీఎన్ఆర్టీఎస్ ప్రధాన కార్యాలయంలో డా. భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను నిర్వహించారు

ఏపీఎన్ఆర్టీఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రముఖ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త మరియు రాజ్యాంగ రూపకర్త డా. భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను నిర్వహించారు. అంటరానివారిగా పరిగణించబడిన దళితజాతి యొక్క సమాజ హక్కుల కోసం అలుపెరుగని కృషి చేశారు. భారతదేశానికి డా. బి.ఆర్. అంబేద్కర్ గారు చేసిన సేవలు స్మరించుకుంటూ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ గారు నివాళి అర్పించారు.