శ్రీమతి. రాధిక గారి అధ్యక్షతన ఏపీ డిజిపి ప్రధాన కార్యాలయం లో నిర్వహించిన లైవ్ యూట్యూబ్ కార్యక్రమంలో శ్రీ. వెంకట్ ఎస్ మేడపాటి గారు

“గల్ఫ్ దేశాలకు వెళ్ళే వలస కార్మికులు తీసుకోవలసిన జాగ్రత్తలు” అంశం పై జనవరి 28వ తేది ఉదయం 11 గంటలకు ADG –CID శ్రీ. పి. వి. సునీల్ కుమార్ గారు, SP-CID శ్రీమతి. రాధిక గారి అధ్యక్షతన ఏపీ డిజిపి ప్రధాన కార్యాలయం లో నిర్వహించిన లైవ్ యూట్యూబ్ కార్యక్రమంలో శ్రీ. వెంకట్ ఎస్ మేడపాటి గారు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. విజిట్ వీసాల మీద పనుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలసకార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులూ, సురక్షిత వలస విధానాలను ప్రోత్సహించుట మరియు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళాలి అనుకునే వారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ కార్యక్రమం లో చర్చించటం జరిగింది.
శ్రీ. వెంకట్ గారు మాట్లాడుతూ గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే వారికి ఏపీఎన్ఆర్టీ సొసైటీ నిర్వహించబోయే అవగాహన కార్యక్రమాలను గురించి వివరించారు. అలాగే వలసలు ఎక్కువగా జరుగుతున్న గ్రామాలు మరియు మండలాలలో సురక్షిత వలస విధానాల గూర్చి తయారు చేసిన ప్రణాళికను వివరించి మరియు ఏపీఎన్ఆర్టీ సొసైటీ అందించే మరిన్ని సేవల గురించి తెలియజేసారు. ఈ కార్యక్రమానికి జూమ్ కాల్ ద్వారా శ్రీ ధీరజ్ కుమార్, లేబర్ ఆఫీస్, భారత రాయబార కార్యాలయం, ఖతార్, శ్రీ. బాలి రెడ్డి, ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్, కువైట్, శ్రీ ఎం.భీమ్ రెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం, హైదరాబాద్, శ్రీమతి. రజనీ మూర్తి, ఏపీఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్ మరియు ప్రెసిడెంట్ ఐసిబిఎఫ్, ఖతార్, పాల్గొన్నారు.
ఈ క్రింది లింక్ ద్వారా జరిగిన కార్యక్రమం వీక్షించగలరు: https://youtu.be/E8M5sG3y5u0