శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు తన తండ్రి గారైన శ్రీ. మేడపాటి సత్యనారాయణ రెడ్డి గారు విద్యనభ్యసించిన పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం, ఏలేటిపాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ZPH స్కూల్ కు మొదటి విడతగా 10 లక్షల రూపాయల విరాళం అందించారు

ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు తన తండ్రి గారైన శ్రీ. మేడపాటి సత్యనారాయణ రెడ్డి గారు విద్యనభ్యసించిన పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం, ఏలేటిపాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ZPH స్కూల్ కు మొదటి విడతగా 10 లక్షల రూపాయల విరాళం అందించారు. క్రీడా ప్రాంగణం, పిల్లల భోజనశాలలో టేబుళ్లు, కుర్చీలు, బాలబాలికలకు వేర్వేరుగా సైకిల్ స్టాండ్స్ మొదలగు వాటికోసం మొదటి విడతగా ఈ విరాళం అందించానని శ్రీ వెంకట్ గారు తెలిపారు. ఈ రోజు మా నాన్న గారు చదువుకున్న పాఠశాలకు నా వంతు సహాయం చేయడం పుణ్యంగా భావిస్తున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి గర్వకారణమన్నారు.