ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలసదారులను ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావాలన్న విధి విధానాలను, ఆమ్నెస్టీ మార్గదర్శకాల గురించి వర్చువల్ సమావేశం జరిగింది

వీసా గడువు ముగిసిపోయినా ఇంకా అదే దేశం లో నివసిస్తున్న వారిని దేశం విడిచి వెళ్ళమని ఆమ్నెస్టీ ప్రకటిస్తాయి కొన్ని దేశాలు. ఈ నేపథ్యం లో ఒమాన్ దేశం ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) ప్రకటించింది. అయితే ఈ ఆమ్నెస్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలసదారులను ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావాలన్న విధి విధానాలను, ఆమ్నెస్టీ మార్గదర్శకాల గురించి వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు, డైరెక్టర్ శ్రీ. బి.హెచ్ ఇలియాస్ గారు, సీఈఓ (ఇంఛార్జ్) శ్రీ. మల్లేశ్వర రావు గారు ఒమాన్ లోని కోర్దినేటర్లతో చర్చించారు. ఈ సమావేశంలో ఏపీఎన్ఆర్టీ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.