కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల సమయంలో ప్రవాసాంధ్ర ప్రయాణీకుల పాస్ పోర్ట్ లు కలెక్ట్ చేసుకోవడం జరిగింది

కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల సమయంలో వివిధ దేశాల నుండి తమ స్వస్థలాలకు హైదరాబాద్ విమానాశ్రయం వచ్చిన ప్రవాసాంధ్ర ప్రయాణీకుల పాస్ పోర్ట్ లు, విజయవాడ రెవిన్యూ డిపార్టుమెంట్ వారు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. పలు జిల్లాల నుండి విజయవాడ వెళ్లి పాస్ పోర్ట్ తీసుకోవాలంటే కష్టం అవుతుందని భావించి ప్రవాసాంధ్రులు, కష్ట పడకూడదు అనే ఆలోచనతో రాయలసీమ కు చెందిన వారి పాస్ పోర్టులను ఏపీఎన్ఆర్టిఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్ గారి ఆదేశాలతో రాజంపేటలో ఉన్న ఏపీఎన్ఆర్టిఎస్ కార్యాలయానికి పంపించడం జరిగింది.
26 మంది ప్రయాణీకుల పాస్ పోర్ట్ లు రాజంపేట శాసన సభ్యులు టి.టి.డి. పాలక మండలి సభ్యులు శ్రీ. Meda Venkata MallikarjunaReddy గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.