APNRT Society మైగ్రంట్ రీసోర్స్ సెంటర్ ద్వారా 24/7 హెల్ప్ లైన్ నెలకొల్పింది. ఈ 24/7 హెల్ప్ లైన్ సంవత్సరంలో 365 రోజులూ నిరంతరాయంగా పనిచేస్తూ ప్రవాసాంధ్రులకు సేవలందిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT Society ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత మరియు అభివృద్ధి కొరకు APNRT Society మైగ్రంట్ రీసోర్స్ సెంటర్ ద్వారా 24/7 హెల్ప్ లైన్ నెలకొల్పింది. ఈ 24/7 హెల్ప్ లైన్ సంవత్సరంలో 365 రోజులూ నిరంతరాయంగా పనిచేస్తూ ప్రవాసాంధ్రులకు సేవలందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల కొరకు ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సౌకర్యం, ఎక్స్-గ్రేషియా, ప్రవాసాంధ్రుల భౌతికకాయాలను స్వగ్రామాలకు తరలింపులో సహాయం, పెట్టుబడులపై సలహాలు, కనెక్ట్ టు ఆంధ్రా – ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్, అడ్వాన్స్డ్ ఐటి కోర్సులలో శిక్షణ, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ, కెరీర్ కౌన్సెలింగ్ (విద్యావాహిని), అత్యవసర పరిస్థితులలో స్వదేశానికి తీసుకురావడం, NRI గ్రీవెన్స్ సెల్, రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల దర్శనాలు,పాస్ పోర్ట్, ఓసిఐ/పాన్/ఆధార్ కార్డ్ దరఖాస్తు చేసుకునే విధానం గురించి మార్గదర్శనం చేయడం, ముఖ్యమైన పత్రాలు పోగొట్టుకున్నప్పుడు తిరిగి పొందడంలో సహాయపడటం, పన్ను చెల్లింపు పై సలహాలు, టూర్స్ మరియు ప్యాకేజెస్ వంటి వివిధ సేవలు అందిస్తోంది. ప్రవాసాంధ్రులు ఏపీఎన్‌ఆర్‌టీ‌ఎస్ 24/7 హెల్ప్ లైన్ 08632340678 ని సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.