APNRTS మలేషియా ఆమ్నెస్టీ ద్వారా రాష్ట్రానికి చేరుకున్న 28 మంది ప్రవాసాంధ్రులు

ఉపాధి నిమిత్తం మలేషియా వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయిన పలువురు రాష్ట్ర వాసులకు ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ మలేషియా ఆమ్నెస్టీ ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చారు. 28 మంది ప్రవాసాంధ్రులు ఆదివారం రాత్రి విశాఖ విమానాశ్రయం చేరుకొని వారి స్వస్థలాలకు వెళ్లారు. వారిలో కొందరు ఏపీఎన్ఆర్టీ చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగాలకు లోనయ్యారు.