ఇతర దేశాల నుండి వచ్చే వ్యక్తులను క్వారంటైన్ మరియు కోవిడ్ పరీక్షలు చేయు సమయంలో అధికారులు ఈ క్రింది మార్గదర్శకాలను అనుసరించాలి

విదేశాల నుండి వచ్చే వ్యక్తులు:

గర్భిణీ స్త్రీలు, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, కుటుంబంలో మరణం దృష్ట్యా , కుటుంబంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల దృష్ట్యా , మరియు విదేశాలలో చికిత్స పొందిన తర్వాత వచ్చే వ్యక్తులను కోవిడ్ పరీక్షల తరువాత ఇంటి నిర్బంధానికి (క్వారంటైన్) అనుమతించబడతారు. కోవిడ్ పరీక్షలో కొరోనా లక్షణాలు ఉంటే, వారిని వెంటనే రీకాల్ చేసి కోవిడ్ ఆసుపత్రులకు పంపాలి.

అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వచ్చే వ్యక్తులు నుండి వారి యొక్క సమస్య గురించి స్వీయ ప్రకటన (సెల్ఫ్ డిక్లరేషన్) తీసుకోవాలి మరియు తప్పుడు ప్రకటన విషయంలో ప్రాసిక్యూషన్ జరుగుతుందని స్పష్టం చేయబడుతుంది. విదేశాల నుండి వచ్చే మిగిలిన వ్యక్తులు ప్రభుత్వ చెల్లింపు లేదా ఉచిత క్వారంటైన్ కి పంపబడతారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు / సిపిలు / ఎస్పీలు పై సూచనలను సూక్ష్మంగా పాటించాలి.